సంఖ్యా జ్యోతిష్యం:  పుట్టిన తేది ప్రకారం.. శివరాత్రి రోజున చేయాల్సిన పూజ ఇదే..!

సంఖ్యా జ్యోతిష్యం:  పుట్టిన తేది ప్రకారం.. శివరాత్రి రోజున చేయాల్సిన పూజ ఇదే..!

 మహాశివరాత్రి చాలా విశిష్టమైన రోజని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఆ రోజున శివుడిని పూజిస్తే కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.    న్యూమరాలజీ జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో జన్మించిన  వారు  శివరాత్రి రోజు కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు.  ఇప్పుడు ఏ తేదీన జన్మించిన వారు ఎలాంటి పరిహారాలో చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!

న్యూమరాలజీ  అనేది సంఖ్యల శక్తిని అధ్యయనం చేస్తుంది, ఒక వ్యక్తి పుట్టిన తేదీ, పేరు, ఇతర వ్యక్తిగత వివరాలలోని సంఖ్యలను విశ్లేషించడం ద్వారా వారి గురించి అంచనాలు వేస్తుంది. పుట్టిన తేదీ ప్రజల వ్యక్తిత్వాన్ని, జీవిత మార్గాన్ని ప్రభావితం చేయగలదని సూచిస్తుంది.

1,10,19, 20  : ఈ తేదీలలో పుట్టిన వారు శివరాత్రి రోజున  శివ పార్వతులకు బట్టలు సమర్పించాలి.  ఆది దంపతులను పసుపు రంగు పూలతో పూజించాలి.  ఇలా చేయడం వలన  ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది.  ఇంకా  కెరీర్ లో వచ్చే ​ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

2,11,20,29: ఈ తేదీలలో పుట్టిన వారు శివరాత్రి రోజున   శివలింగానికి రోజ్​ వాటర్ తో అభిషేకం చేయాలి.  ఇలా చేయడం వలన  జీవితంలో ప్రశాంతత కలుగుతుంది.  ఇంకా  సంపద వృద్ది చెంది.. విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

3,12,21,30 : ఈ తేదీలలో జన్మించిన వారు పరమేశ్వరునికి కుంకుమపువ్వు కలిపిన నీళ్లతో అభిషేకం చేయాలి.  ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు పరిష్కారంతో పాటు.. జీవితంలో స్థిరత్వం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

4,13,22,31:  ఈ తేదీలలో జన్మించిన వారు పంచదారతో అభిషేకం చేయాలి.  జీవితంలో అన్ని విషయాల్లో సానుకూలత ఏర్పడి.. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. 

5,14,23:   ఈ తేదీలలో జన్మించిన వారు శివరాత్రి రోజున స్వామి వారిని  బిల్వపత్రంతో పూజించాలి.. చెరుకు రసంతో అభిషేకం చేయడం వలన  ఆర్థిక సమస్యలకు పరిష్కారం కలుగుతుంది

6,15,24 :   ఈ తేదీలలో జన్మించిన వారు మహాశివరాత్రి రోజున శివలింగానికి చందనం సమర్పించాలి.  ఇలా చేయడం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుంది.  దీనితో ఐశ్వర్యం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు.

7,16,25 :   ఈ తేదీలలో జన్మించిన వారు పరమేశ్వరునికి రుద్రాక్షలు సమర్పించి.. దానిమ్మ రసంతో అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలకు విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 

8,17,26 :   ఈ తేదీలలో జన్మించిన వారు శివరాత్రి రోజున శివయ్యకు నల్లనువ్వులు..  ఆవనూనె.. సమర్పించాలి. ఇలా చేయడం వలన  శత్రువులు మిత్రులుగా మారతారు. 

9,18,27 :ఈ తేదీలలో జన్మించిన వారు శివరాత్రి రోజున స్వామి వారికి  ఎరుపు రంగు పువ్వులు, పండ్లు సమర్పించాలి.  ఇలా చేయడం వలన కెరీర్​లో ఎదురయ్యే  సమస్యలు పరిష్కారమవుతాయని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.